స్వైన్‌ఫ్లూ కలకలం

456
స్వైన్‌ఫ్లూ కలకలం
స్వైన్‌ఫ్లూ కలకలం

స్వైన్‌ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో జనవరిలో మూడు కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కొలుకోగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి ఈ వ్యాధి ప్రతాపం చూపుతుంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా,  జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నెలలో ఒకరిద్దరు లక్షణాలతో వెలుగులోకి వస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువ సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. పది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన 46 సంవత్సరాల వ్యక్తికి స్వైన్‌ప్లూ సోకింది. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మాలపల్లికి చెందిన 30 సంవత్సరాల మహిళ , గౌతంనగర్‌కు చెందిన ఐదేళ్ల  చిన్నారికి స్వైన్‌ప్లూ సోకింది. వైద్యులను సంప్రదించగా లక్షణాలు వెలుగులోకి రావడంతో జిల్లా వైద్యశాఖకు సమాచారం అందించారు.

 అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంటింటికి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్‌లో సుభాష్‌నగర్‌కు చెందిన ఒకరికి స్వైన్‌ప్లూ సోకకగా హైదరాబాద్‌లో చికిత్స పొందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది 11 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో మూడు కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. స్వైన్‌ప్లూకు సంబంధించి అధికారులు మందులను అందుబాటులో ఉంచారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కలిగి ఉన్న రోగులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు.

నిజామాబాద్‌అర్బన్‌: స్వైన్‌ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో జనవరిలో మూడు కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కొలుకోగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి ఈ వ్యాధి ప్రతాపం చూపుతుంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా,  జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నెలలో ఒకరిద్దరు లక్షణాలతో వెలుగులోకి వస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువ సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. పది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన 46 సంవత్సరాల వ్యక్తికి స్వైన్‌ప్లూ సోకింది. ప్రస్తుతం ఇతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మాలపల్లికి చెందిన 30 సంవత్సరాల మహిళ , గౌతంనగర్‌కు చెందిన ఐదేళ్ల  చిన్నారికి స్వైన్‌ప్లూ సోకింది.

వైద్యులను సంప్రదించగా లక్షణాలు వెలుగులోకి రావడంతో జిల్లా వైద్యశాఖకు సమాచారం అందించారు.  అప్రమత్తమైన ౖÐð వైద్యాధికారులు ఆయా ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇంటింటికి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్‌లో సుభాష్‌నగర్‌కు చెందిన ఒకరికి స్వైన్‌ప్లూ సోకకగా హైదరాబాద్‌లో చికిత్స పొందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది 11 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో మూడు కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. స్వైన్‌ప్లూకు సంబంధించి అధికారులు మందులను అందుబాటులో ఉంచారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కలిగి ఉన్న రోగులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం అందించాలని ఆదేశించారు.
స్వైన్‌ప్లూ వీరికి ప్రమాదకరం..
గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లపైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి చికిత్సకు తగ్గని అధిక జ్వరం ఊపిరిపీల్చడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఛాతి,కడుపులో నొప్పి, వరుసగా వాంతులు హఠాత్తుగా ఆయోమయస్థితి చిన్నపిల్లల్లో దద్లుర్లతో కూడిన జ్వరం శరీరం నీలిరంగుగా మారడం

జాగ్రత్తలు

  • స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్న రోగులు జనసామూహంలోకి వెళ్లకూడదు.
  • తగ్గినప్పుడు, తూమ్మినప్పుడు ముఖానికి చేతిరుమాలు పెట్టుకోవాలి
  • తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులను శుభ్రంగా కడుకోవాలి.
  • స్వైన్‌ప్లూ సోకిన వ్యక్తి వాడిన వస్తువులు, దుస్తులు ఇతరులు వాడకూడదు.
  • స్వైన్‌ప్లూ సోకిన వారికి కరచానలం చేయకుండా దూరంగా ఉండాలి.
  • జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
  • లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అప్రమత్తంగా ఉండాలి
స్వైన్‌ప్లూపై ముందస్తు జాగ్రత్తలే మేలు. వ్యాధి లక్షణాలు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. సరైన చికిత్స ద్వారా వ్యాధి నయమవుతుంది. కాని వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఈ వ్యాధికి అనుకూలంగా కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్‌ జలగం తిరుపతిరావు,
జనరల్‌ ఫిజీషియన్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల