20వేల ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంకు రూ.1399లకే

380

ఇంటర్నెట్‌  వినియోగం పెరుగుతున్న క్రమంలో పవర్‌బ్యాంకుల ఆవశ‍్యకత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బడ్జెట్‌ధరల్లో ఫీచర్‌ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న ఇంటెక్స్‌ స్మార్ట్‌ యూజర్లకు భారీ ఆఫర్‌  ప్రకటించింది. 20వేల ఎంఏహెచ్‌  సామర్ధ్యం ఉన్న పవర్‌బ్యాంకును  తగ్గింపుధరలో అందుబాటులోకి తెచ్చింది.

ఒకేసారి పలు డివైస్‌లకు  చార్జింగ్‌పెట్టుకునే అవకాశం ఉన్న ఇంటెక్స్‌ ఐటీ-పీబీఏ 20వేల లిథియం పాలిమర్‌ పవర్‌ బ్యాంకు (వైట్‌)ను  కేవలం  రూ.1399 లకే అందిస్తోంది. దీని ఎంఆర్‌పీ ధర. రూ. 3550 లు.  పత్ర్యేకంగా  అమెజాన్‌ ద్వారా  ఒక్కరోజుకే ఈ సేల్‌ నిర్వహిస్తోంది.  ఈ  ఆఫర్‌ ఈ  ఒక్కరోజు (ఫిబ్రవరి 11)కే పరిమితమని, అదీ స్టాక్‌ ఉన్నంత వరకేనని ఇంటెక్స్ టెక్నాలజీస్‌ ప్రకటించింది.