ధోని భాయ్‌ ఉంటే.. సొంత దేశంలో ఆడినట్టే

324
ధోని భాయ్‌ ఉంటే.. సొంత దేశంలో ఆడినట్టే
ధోని భాయ్‌ ఉంటే.. సొంత దేశంలో ఆడినట్టే

ధోని భాయ్‌ ఉంటే.. సొంత దేశంలో ఆడినట్టే

ధోని భాయ్‌ ఉంటే.. సొంత దేశంలో ఆడినట్టే టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని వికెట్ల వెనుక ఉంటే క్రీజు వీడవద్దని ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ ధోని వికెట్ల వెనుక ఉంటే విదేశీ పర్యటనలో కూడా సొంత దేశంలో ఆడినట్టే ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

అంతేకాకుండా నాలుగో వన్డేలో ధోని తనకో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడని ట్వీట్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో తాను బౌలింగ్‌ చేస్తుండగా ధోని మరాఠీలో సలహా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడని పేర్కొన్నాడు.

ఆ సలహా పాటించగా విజయవంతంగా పనిచేసిందని చెప్పుకొచ్చాడు. ఇక ధోని మరాఠీలో జాదవ్‌కు సలహా ఇస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 35 పరుగులతో నెగ్గి 4-1 సిరీస్‌ గెలిచి కివీస్‌ గడ్డపై నయాచరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే