రిషభ్‌ను ఆడించండి గావస్కర్‌

213
రిషభ్‌ను ఆడించండి గావస్కర్‌
రిషభ్‌ను ఆడించండి గావస్కర్‌

రిషభ్‌ను ఆడించండి గావస్కర్‌

రిషభ్‌ను ఆడించండి గావస్కర్‌ ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కు అవకాశం ఇవ్వాలని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస‍్కర్‌ సూచించాడు.ఈ క్రమంలోనే అతన్ని నాలుగు లేదా ఐదు స్థానాల్లో ఆడించాలని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీసుల్లో బీసీసీఐ సెలక్టర్లు పంత్‌కు అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. దాంతో రిషభ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలంటూ గావస్కర్‌ తెలిపాడు.

‘నా వరకూ అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషభ్‌ పంత్‌ ఉండాలనే చెబుతా. టాప్‌ ఆర్డర్‌లో అతడి ఎడమచేతి వాటం జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఉపఖండంలో ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో అతడిని ఎంపిక చేయాలి. పంత్‌ను 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపి అదనపు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఆడుతున్నాడో తెలుస్తుంది. అని గావస్కర్‌ అన్నారు.

ఇప్పటి వరకు కెరీర్‌లో మూడు వన్డేలు ఆడిన రిషభ్ పంత్‌ పెద్దగా రాణించలేదు. రెండు ఇన్నింగ్సుల్లో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టెస్టుల్లో రెండు శతకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో 159 పరుగులత అజేయంగా నిలిచి అందర్నీ ఆకట్టుకున్నాడు.  ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 13 వరకూ భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరుగునుంది. ఇందులో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది.