టీడీపీకి ‘షా’కిచ్చేలా..!

231
టీడీపీకి 'షా'కిచ్చేలా..!
టీడీపీకి 'షా'కిచ్చేలా..!

టీడీపీకి ‘షా’కిచ్చేలా..!

అమిత్‌ షా గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఆ పార్టీ జిల్లాఅధ్యక్షురాలు గౌతు శిరీష, నాయకులు
పలాస ఎమ్మెల్యేకు భంగపాటు కాశీబుగ్గ: పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీకి సోమవారం భంగపాటు ఎదురైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద దిగిన సమయంలో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. మానవహారం, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలి పారు. అయితే అది కాస్తా శ్రుతి మించడంతో పో లీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

అమిత్‌ షా కాన్వాయ్‌ ముందు నిరసన తెలపాలని నా యకులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేకించి తనపైకి పోలీసులు ఎన్నడూ రాలేదన్న ధీమాతో ఎమ్మెల్యే రెండు గంటలపా టు నిరసనల్లో పాల్గొన్నారు. సీఐ వి.చంద్రశేఖ రం నచ్చజెప్పినా ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, అల్లుడు వెంకన్న చౌద రి వినలేదు. స్పెషల్‌ పార్టీ పోలీసుల మాటా వినకపోవడంతో వారిని బలవంతంగా అరెస్టు చేశా రు. గతంలో జగన్, పవన్‌ కల్యాణ్‌ రాకల సందర్భంలోనూ ఇలాగే నిరసన చేస్తే పోలీసులు ఏమీ అనలేదు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేతో సహా ఆయన కుటుంబాన్ని, పార్టీ నాయకులను అరె స్టు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.