ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను

257
ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను
ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను

ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను

ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను వరల్డ్‌ క్యాన్సర్‌ డే సందర్భంగా నటుడు ఆయుష్మాన్‌ ఖురానా భార్య తహీరా కశ్యప్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘ఇవాళ నా రోజు. అందరికీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలి. ముందు మనం ఈ వ్యాధిపై మనకున్న అపోహలను తొలగించుకోవాలి. అందుకే ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. నా ఒంటిపై ఉన్న ఈ క‌త్తిగాట్లు ఓ గౌర‌వ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్ని కాకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాను’ అంటూ తహీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ ఫోటోను బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా తెగ లైక్‌ చేస్తున్నారు.

మీ మాటలు చాలా మందికి ధైర్యాన్ని ఇస్తాయంటూ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. తహీరా కశ్యప్‌ తొలిదశ రొమ్ము క్యాన్సర్ (1A)తో బాధపడిన సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా చాలా సర్జరీలను కూడా చేయించుకున్నారు. ఈ విషయం గురించి తహీరా మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం చాలా కష్టం. ఇక్కడ పర్ఫేక్ట్‌గా ఏది ఉండదు. మనల్ని మనలా అంగీకరించడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. ఈ ఫోటోను నేను పడిన బాధను తెలియజేసే చిహ్నంలా కాక క్యాన్సర్‌పై నా గెలుపుకు గుర్తుగా పోస్ట్‌ చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు.